దివాకర్ ట్రావెల్స్ కు చెందిన ఐదు బస్సులు సీజ్

  • పర్మిట్లు లేకుండా నడిపిస్తున్నారన్న అధికారులు
  • జేసీ దివాకర్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ
  • రాష్ట్రంలో 36 బస్సులు, మరో 18 కాంట్రాక్ట్ బస్సుల సీజ్  
సరైన పర్మిట్లు లేకుండానే బస్సులు నడుపుతున్నారన్న కారణంతో ఆంధ్రప్రదేశ్ లో రవాణా శాఖ అధికారులు తనిఖీలను విస్తృతం చేశారు. ఈ రోజు జరిపిన తనిఖీల్లో టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి చెందిన దివాకర్ ట్రావెల్స్ కు చెందిన ఐదు బస్సులను సీజ్ చేశారు. ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియర్ పర్మిట్లు లేకుండానే ఈ బస్సులు నడిపిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. అనంతపురం డీటీసీ శివరాం ప్రసాద్ నేతృత్వంలో ఈ తనిఖీలు జరిగాయి. ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియర్ పర్మిట్ల నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినట్టు గుర్తించి మొత్తం 36 బస్సులు, మరో 18 కాంట్రాక్ట్ బస్సులను సీజ్ చేశారు.
Go Back to Shorts
JC Travels
buses
seized
Ap transport authorities

More Telugu News